Telangana Congress 3rd List : కాంగ్రెస్ మూడో జాబితా వచ్చేసింది..కామారెడ్డి బరిలో రేవంత్

కామారెడ్డి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు

Published By: HashtagU Telugu Desk
Congress 3rd List

Congress 3rd List

ఎప్పుడెప్పుడా అని యావత్ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్న కాంగ్రెస్ మూడో జాబితా (Telangana Congress 3rd List) వచ్చేసింది. సోమవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (K. C. Venugopal) మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అంత భావించినట్లే కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ ఫై రేవంత్ (Revanth Reddy Kaamareddy) బరిలోకి దిగుతుండగా… షబ్బీర్ అలీ (Mohammed Ali Shabbir) నిజామాబాద్ అర్బన్ నుంచి పోటి చేస్తున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

బోథ్ అభ్యర్థిని మాత్రం మార్చారు. వెన్నెల అశోక్ ప్లేస్ లో ఆదే గజేందర్‌ను నిలబెట్టారు. అలాగే వనపర్తి లో సైతం అభ్యర్థిని మార్చారు. చిన్నారెడ్డి ప్లేస్ లో మేఘారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక పఠాన్ చెరులో నీలం మధుకు అవకాశం ఇవ్వగా.. చెన్నూరు నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వివేక్ పోటీ చేస్తున్నారు. ఇంకా నాలుగు స్థానాలు ప్రకటించలేదు. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీపీఎంపై చివరి వరకు చర్చలు జరుపుతామని కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నాలుగు సీట్లలో రెండు లేదా ఒక సీటును సీపీఎం కోసం పెండింగ్‌లో పెట్టారా అన్న చర్చ నడుస్తుంది.

ఇక మూడో జాబితా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

  1. చెన్నూర్- డాక్టర్ జీ వివేక్
  2. బోథ్-ఆదే గజేందర్
  3. జుక్కల్ (ఎస్సీ) – తోట లక్ష్మీకాంతరావు
  4. బాన్సువాడ -ఏనుగు రవీందర్ రెడ్డి
  5. కామారెడ్డి – రేవంత్ రెడ్డి
  6. నిజామాబాద్ అర్బన్- మహ్మద్ షబ్బీర్ అలీ
  7. కరీంనగర్- పురుమళ్ల శ్రీనివాస్
  8. సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి
  9. నారాయణ్ ఖేడ్- సురేశ్ కుమార్ షెట్కార్,
  10. పఠాన్ చెరు- నీలం మధు ముదిరాజ్
  11. వనపర్తి- తుడి మేఘారెడ్డి
  12. డోర్నకల్ (ఎస్టీ) -డాక్టర్ రామచంద్రు నాయక్,
  13. ఇల్లందు (ఎస్టీ) – కోరం కనకయ్య,
  14. వైరా (ఎస్టీ) – రాందాస్ మాలోత్,
  15. సత్తుపల్లి (ఎస్సీ)- డాక్టర్ మట్ట రాగమయి,
  16. అశ్వరావుపేట (ఎస్టీ) జారే ఆది నారాయణ.

Read Also : Rangasthalam : అనసూయ రంగమ్మత్త పాత్రకి రాశి నో చెప్పింది.. ఎందుకు?

  Last Updated: 06 Nov 2023, 11:21 PM IST