Site icon HashtagU Telugu

KTR Phoned Sunil Rao: బీఆర్ఎస్‌లో క‌ల‌వ‌రం.. పార్టీ మారొద్దంటూ సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్‌?

KTR Phoned Sunil Rao

KTR Phoned Sunil Rao

KTR Phoned Sunil Rao: తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఇప్ప‌టికే 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైంది. అప్ప‌ట్నుంచి ఆ పార్టీ నుంచి వ‌ల‌స‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆ త‌ర్వాత 2024లో జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఒక సీటు కూడా సాధించ‌కుండా అవ‌మానం ఎదుర్కొంది. దీంతో పార్టీలో కీల‌క నేత‌లు పార్టీని వీడి కాంగ్రెస్‌, బీజేపీల్లో చేరుతున్నారు. ఇదే కోవ‌లో తాజాగా కరీంన‌గ‌ర్ జిల్లా మేయ‌ర్ సునీల్ రావు కూడా బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్‌?

కరీంనగర్ జిల్లా మేయర్ సునీల్ రావు రాజీనామాతో బీఆర్ఎస్‌ అలర్ట్ అయింది. మేయర్ సునీల్ రావును బీఆర్ఎస్‌ అధిష్టానం బుజ్జ‌గించే ప‌నిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పార్టీ మారొద్దంటూ సునీల్ రావుకు కేటీర్ ఫోన్ (KTR Phoned Sunil Rao) చేసిన‌న‌ట్లు స‌మాచారం. నేడు బీజేపీలో చేరేందుకు సునీల్ రావు రంగం సిద్ధం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న కార్పొరేటర్ల‌తో స్థానిక‌ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ స‌మావేశ‌మై పార్టీ మార‌వ‌ద్దు అంటూ కీల‌క సూచ‌న‌లు ఇచ్చారు.

Also Read: National Voters’ Day : ఓటు వేయడం అమూల్యమైన హక్కు మాత్రమే కాదు మన కర్తవ్యం కూడా అని మర్చిపోవద్దు..!

బీఆర్ఎస్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మేయ‌ర్‌

పార్టీ మార్పుపై క‌రీంన‌గర్ జిల్లా మేయ‌ర్ సునీల్ రావు క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులతో నాకు ఎలాంటి విభేదాలు లేవని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వలనే కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్ర‌మంత్రి, ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ పార్టీ పరంగానే విమర్శలు చేశాన‌ని అన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు త‌న‌తో కలిసి బీజేపీలోకి వస్తారని ఆయ‌న బ‌హిరంగంగా స్టేట్మేంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో త‌న‌పై దుష్ప్రాచారం చేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చ‌రించారు. కరీంనగర్ నగర అభివృద్ధే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నాను అంటూ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు.