Site icon HashtagU Telugu

Bhupalpally Collector : అటెండర్ తో బూట్లను మోయించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్

Collector Bhavesh Mishra

Collector Bhavesh Mishra

జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally ) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) వివాదంలో చిక్కుకున్నారు. తన బూట్లను (Shoes) అటెండర్ (Attender) తో మోయించి వార్తల్లో నిలిచారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఒక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి కలెక్టర్ షూ లతో ప్రవేశించారు. వెంటనే తన షూ విప్పి.. పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. అటెండర్ ధఫేదార్ వాటిని తీసుకెళ్లి చర్చి బయట వదిలివచ్చారు. అక్కడున్నవారంతా ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

2015 బ్యాచ్ కు ఐపీఎస్ భవేశ్.. ఇటీవలే భూపాలపల్లి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఉట్నూర్ లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్ధ ప్రాజెక్ట్ అధికారిగా విధులు నిర్వహించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ గా కూడా తన సేవలందించారు. కాగా తన కింది స్థాయి వారిని (అటెండర్)తో అలా ప్రవర్తిస్తూ.. బూట్లు మోయించడంపై నెటిజన్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అటెండర్ అయినా.. కలెక్టర్ అయినా ప్రభుత్వం ఉద్యోగులేనని, అంతా సమానమేనని అంటున్నారు. తోటి ఉద్యోగులను కించపరచడం సరికాదంటూ కలెక్టర్ భవేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Sankranti Movies: సంక్రాంతి సినిమాల పంచాయితీ.. ఎవ్వరు తగ్గడం లేదుగా