చలి పులికి తెలంగాణ ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం తొమ్మిదో అయితేనేకానీ నిద్రవీడటం లేదు. మబ్బు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు తొంగిచూస్తున్నా.. జనాలు పడక గదులను వీడటం లేదు. ఇక సాయంత్రం ఏడు అయితే చాలు ఏ ఒక్కరూ రోడ్ల మీద కనిపించడం లేదు. సీజన్ లో అత్యధికంగా చలి నమోదు కావడంతో జనాలు గజగజ వణికిపోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కంటే తక్కువగా నమోదైనట్టు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆదిలాబాద్ లో అతితక్కువగా 3.5 డిగ్రీ సెలీసియస్ గా నమోదైంది. కోల్డ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యం లో ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉన్నటు తెలిపింది. రానున్న రెండు మూడు రోజులు ప్రజలందరూ కూడా అప్రమతంగా ఉండాలని హెచరించింది. మొదటిసారిగా, హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే 3-4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. రానున్న మూడు రోజుల పాటు చలిగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా GHMC ప్రాంతంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా పడిపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ చలితో వణికిపోతోంది. సీజన్ లోనే అత్యధిక చలి నమోదు అయినట్టు సమాచారం.
మొయినాబాద్‌లో అత్యల్పంగా 6.9 డిగ్రీలు
ఘట్‌కేసర్ 7.3
షాబాద్ 8.1
రాజేంద్రనగర్ 8.4
వెస్ట్ మారేడ్‌పల్లి 9.5
శామీర్‌పేట 9.6
కంటోన్మెంట్ 11.6
గోల్కొండ 11.9
ఆసిఫ్‌నగర్ 12.3
జూబ్లీ హిల్స్ 12.6