Heavy Rain In HYD : సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష

వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అక్క‌డి నుంచే జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రోనాల్డ్ రోస్‌, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కే శ్రీ‌నివాస రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్ ఏ ఎం రిజ్వీ, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించారు

  • Written By:
  • Publish Date - May 7, 2024 / 11:16 PM IST

హైదరాబాద్ (Hyderabad) లో చిన్న చినుకు పడిందంటే చాలు నగరవాసులకు చుక్కలే..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. అలాంటిది గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం (Rain) పడితే ఇంకేమైనా ఉందా..? ఈరోజు హైదరాబాద్ లో అదే జరిగింది. మంగళవారం సాయంత్రం నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. సికింద్రాబాద్‌ బోయినపల్లి, తిరుమలగిరి, తార్నాక, ఓయూ క్యాంపస్‌, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీర్‌బాద్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

భారీగా వీచిన ఈదురుగాలులతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఇక ట్రాఫిక్ (Traffic Jam) గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అక్క‌డి నుంచే జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రోనాల్డ్ రోస్‌, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కే శ్రీ‌నివాస రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్ ఏ ఎం రిజ్వీ, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించారు.

ఈదురుగాలుల‌తో ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో జ‌ల‌మ‌య‌మైన కాల‌నీల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందించాల‌ని సూచించారు. న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా క్లియ‌ర్ చేసి వాహ‌న‌దారులు త్వ‌ర‌గా ఇళ్ల‌కు చేరుకునేలా చూడాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది చేప‌ట్టే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగ‌స్వాములు కావాల‌ని పార్టీ నేతలకు ,కార్యకర్తలకు సూచించారు.

Read Also : Tirupathi : కోడిబొచ్చు అమ్ముకునేవాళ్లంటూ తిరుపతి సభలో రెచ్చిపోయిన పవన్