Site icon HashtagU Telugu

CM Revanth : వెంకయ్యనాయుడు, జైపాల్‌రెడ్డి‌లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Transgenders for traffic control: CM orders to officials

Transgenders for traffic control: CM orders to officials

CM Revanth : హైదరాబాద్‌లోని HICC‌లో ఇవాళ జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), జైపాల్ రెడ్డి(Jaipal Reddy) లాంటి నేతలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేరని.. ఆ లోటు ఢిల్లీలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలుగు వారు ఢిల్లీ రాజకీయాల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి నేతలను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలపై ఉందని సీఎం రేవంత్(CM Revanth) అభిప్రాయపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘చీఫ్ లీడర్ అంటే ఎన్టీఆర్. ఇవాళ రాజకీయాల్లో ఉన్నవాళ్లంతా ఆయన నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నవారే. ఎన్జీ రంగా, చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ నుంచి రాజకీయాలు నేర్చుకున్నవారే. ఆనాడు ఇందిరాగాంధీని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. అలాంటి టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రభంజనం క్రియేట్ చేసిన ఘనత ఎన్టీఆర్‌‌కే దక్కుతుంది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘నాకు ఎవరు సన్నిహితులో మీకు తెలుసు. కమ్మ సామాజిక వర్గం వారు నన్ను అభిమానిస్తారు. నాకు అవకాశం ఇచ్చిన వారిని తక్కువ చేసి ఎవరూ మాట్లాడకూడదు’’ అని పరోక్షంగా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన గౌరవపూర్వక కామెంట్ చేశారు.

Also Read :NEET UG 2024 : ఆ ఫార్మాట్‌లో ‘నీట్‌ -యూజీ’ రిజల్ట్స్ రిలీజ్.. ‘సుప్రీం’ ఆదేశం అమలు

‘‘కులం అనేది వృత్తిని బట్టి వస్తుంది. కమ్మ అంటే అమ్మ లాంటి వారు. ప్రతి మనిషికి సహాయం చేసే కులం కమ్మ కులం. అట్టడుగు వర్గాలు అయిన దళితులను కమ్మ వారు ఆదుకోవాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా పది మందికి సహాయం చేసేలా కమ్మ వారు ఉండాలి’’ అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ అభివృద్దిలో కమ్మ వారు భాగస్వామ్యం కావాలి. భేషజాలకి మేము వెళ్లం. మాకు అందరూ సమానమే.  అన్ని కులాలను గౌరవిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కుల వివక్ష ఉండదు’’ అని ఆయన స్పష్టం చేశారు. కమ్మ వర్గం సమస్య ఏదైనా పరిష్కరించే బాధ్యత తమదే అని తెలిపారు. ‘‘నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే అమెరికాలో కమ్మవారు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు అందరికీ ఉంటుంది. నిరసనను అణిచివేస్తాం అని కేసీఆర్ లాంటి వాళ్లు అనుకుంటే.. దాని ఫలితాలు ఎలా ఉంటాయో డిసెంబర్ 3న ప్రజలు చూపించారు’’ అని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘గతంలో కమ్మ సామాజిక వర్గానికి 5 ఎకరాలు ఇచ్చినట్లే ఇచ్చి తీసుకున్నారు.. మేము దాన్ని క్లియర్ చేసి అద్భుతమైన కమ్మ సంఘం భవనం కట్టి ఇస్తాం’’ అని సీఎం ప్రకటించారు.