Kavitha Letter : కవితతో సీఎం రేవంతే లేఖ రాయించారా? – ఎంపీ రఘునందన్

Kavitha Letter : "తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిలలా మారబోతున్నారు. ఇది కుటుంబం మధ్యలోని వారసత్వ పోరాటం" అని వ్యాఖ్యానించారు

Published By: HashtagU Telugu Desk
Sharmila Kavitha Raghu

Sharmila Kavitha Raghu

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పేరుతో ఒక లేఖ (Kavitha Letter) వైరల్ కావడం, ఆ లేఖను సీఎం రేవంత్‌రెడ్డే (CM Revanth) రాయించారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) అభిప్రాయపడడం, ఈ వ్యవహారాన్ని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తోంది. “తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిలలా మారబోతున్నారు. ఇది కుటుంబం మధ్యలోని వారసత్వ పోరాటం” అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్లీనరీలో కేటీఆర్‌ను వారసుడిగా ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని, అందుకే కవిత ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతుగా కనిపించవచ్చని తెలిపారు. బీజేపీపై ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం వాస్తవంగా ఉన్నాయని రఘునందన్ పేర్కొన్నారు.

DK Aruna: ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత!

ఇక ఈ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పందించారు. కవిత తన తండ్రికి లేఖ రాయడం అవసరం లేదని, ఆమె నేరుగా చెప్పే అవకాశమున్నందున, ఇది అసలే నమ్మలేనిది అన్నారు. కవిత లేఖను కాంగ్రెస్ పార్టీ సృష్టించిందని బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. “అదంతా డ్రామా, బీఆర్‌ఎస్‌లో ఎలాంటి చీలికలూ లేవు” అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లేకపోవడం వల్లే ఆ పార్టీకి ఓటేశామని వివరణ ఇచ్చారు.

Hyderabad Metro : రేపటి నుంచి హైదరాబాద్‌ మెట్రో ఛార్జీల తగ్గింపు అమలు

ఈ క్రమంలో రాజకీయంగా కవిత లేఖ అంశం వివిధ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. బీజేపీ ఈ లేఖను బీఆర్‌ఎస్ లో అంతర్గత విభేదాలుగా చూపించేందుకు ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరాకరిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ నేతలు ఈ అంశాన్ని పూర్తిగా నకిలీగా, కావాలనే సృష్టించిన కథగా పేర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత రాజకీయ భవిష్యత్తు ఏవిధంగా మలుపుతీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

  Last Updated: 23 May 2025, 04:42 PM IST