తెలంగాణ సీఎం (Telangana CM) గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ రెడ్డి (Revanth Reddy) క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలఫై సమీక్షలు , రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై సమీక్ష, కేంద్రం నుండి రావాల్సిన నిధులు , బకాయిలు తదితర అంశాల ఫై చర్చలు , ఇతర పార్టీల నేతలతో టచ్ లో ఉంటూ తమ బలం పెంచుకోవడం, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం చెప్పడం..ఇలా అన్ని తానై..చూసుకుంటూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు జిల్లాల పర్యటనలకు బయలుదేరుతున్నారు. రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొన్న వరంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరో హైదరాబాద్‌గా వరంగల్ ను తీర్చిదిద్దుతానంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్ ప్రారంభిస్తున్నారు. రేపు మహబూబ్‌నగర్ కి వెళ్లనున్నారు సీఎం రేవంత్.
రేపు కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా గ్రూపు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటీన్‌ను సీఎం ప్రారభించబోతున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగం చేయనున్నారు. అదే సమావేశంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. సాయంత్రం 5.30 గంటల తరువాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న సమస్యలపై నివేదికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also : Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం..హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు