నేడు (మంగళవారం) మహబూబాబాద్ (Mahabubabad ) జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యముగా తెలంగాణ లో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక జిల్లాలో 42 పై సెంటీమీటర్ల వర్షం అది కూడా ఒక్క రోజే కురవడం అనేక చెరువులకు , వాగులకు గండ్లు పడి ఊర్లను , రోడ్లను , రైల్వే ట్రాక్ లను ముంచేసాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జిల్లా అతలాకుతలమైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం, ఖమ్మం , సూర్యాపేట , తోరూరు వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి.
We’re now on WhatsApp. Click to Join.
కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకుపోవడం తో రెండు రోజులుగా రైళ్లు బంద్ అయ్యాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఎగిపోవడంతో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. అనేక పంట పొలాలు నీటమునిగాయి. ఇలా అనేక చోట్ల దారుణమైన పరిస్థితులు నెలకొనడం తో సీఎం రేవంత్ రెడ్డి నేడు పరిశీలించనున్నారు. ఇందుకు గాను స్వయంగా రంగంలోకి దిగారు. నిన్న ఖమ్మం , పాలేరు లలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన రేవంత్..నేడు మహబూబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. అకేరువాగు వంతెన తో పాటు నెల్లికుదురు మం. రావిరాల గ్రామాన్ని సీఎం రేవంత్ సందర్శించనున్నారు.
Read Also : Dialogue War : కేటీఆర్ పై..రేవంత్ ..రేవంత్ పై కేటీఆర్..ఎక్కడ తగ్గడం లేదు ..!!