తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ (Telangana Talli Statue)కు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా వెళ్లి ఆయనను ఆహ్వానిస్తారని తెలిపారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను కూడా ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. ఈ నెల 9న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. అలాగే అసెంబ్లీ సమావేశాలపై కూడా రేవంత్ మాట్లాడారు. ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ పాల్గొని తన రాజకీయ అనుభవంతో ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ, కుటుంబ పెద్దగా వారికి సర్దిచెప్పాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత ప్రజల సమస్యలపై చర్చించేందుకు అవకాశం దొరకలేదని రేవంత్ తెలిపారు. గత పదేళ్లుగా సీఎం సచివాలయానికి కూడా రాలేదని, ప్రజలు అన్నింటిని గమనించి బీఆర్ఎస్‌ను అధికారానికి దూరం చేశారని , ప్రజల తీర్పుతో వారిలో ఆలోచన విధానం మారాలని అన్నారు. ఇదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆచారాలను రేవంత్ గుర్తు చేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు వంటి నేతలు ప్రభుత్వం పని తీరుపై సలహాలు ఇచ్చేవారని తెలిపారు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. ఈ నెల 9 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు తప్పక పాల్గొనాలని సూచించారు. బుధువారం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి “ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్”ను ప్రారంభించారు. పేదవారికి ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Read Also : Telangana Assembly : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరిన సీఎం రేవంత్