తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు (Dengue fever) రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు డెంగ్యూ తో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సీజనల్ వ్యాధులపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని, అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు.
పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
Read Also : TDP : టీడీపీలో చేరిన మేయర్ దంపతులు