Site icon HashtagU Telugu

CM Revanth : మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్…ఈసారి ఎందుకంటే !!

Future plans to make Telangana a model for the country in all sectors: CM Revanth Reddy

Future plans to make Telangana a model for the country in all sectors: CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ పర్యటన(Delhi)కు వెళ్తున్నారు. ఈరోజు (బుధవారం) రాత్రి ఢిల్లీకి బయలుదేరనున్నారు. గురువారం ఢిల్లీలో ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్‌తో కీలక భేటీ చేయనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడులు, విదేశీ సహకారం వంటి అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. ఈ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కలసి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు.

ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్లు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో మంతనాలు జరిపారు. అయితే ఈసారి ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన వైఖరిలో కొంత స్పష్టత, ధైర్యం కనిపిస్తున్నట్లు ఆయనను దగ్గరగా గమనించే వర్గాలు చెబుతున్నాయి. కొత్త బలం వచ్చినట్టే ఆయన తీరు ఉండటంతో, అధికార పరిపాలనపై మరింత ఫోకస్ పెంచనున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో కేబినెట్ మంత్రులపై వచ్చిన ఆరోపణలపైనా ఆయన చర్యలు తీసుకోవాలన్న సంకేతాలు వెలిబుచ్చుతున్నారు.

Youtube : యూట్యూబ్ లో ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుందో తెలుసా..?

గత 18 నెలలుగా ప్రభుత్వ విధానాలపై పూర్తి నియంత్రణ లేకుండా సాగిన పరిపాలనకు ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సంకల్పించినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటివరకు పార్టీ వ్యవహారాలపై మౌనంగా ఉన్న ఆయన, ఇక నుంచి పాలనాపరంగా గట్టి అడుగులు వేయనున్నారని అంచనా. ఢిల్లీ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి అధికారికంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ పర్యటనతో రేవంత్ రెడ్డి పాలనలో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.