తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాలుగో విడత రుణమాఫీ (Fourth Phase Of Farmer Loan Waiver)ని విడుదల చేశారు. మహబూబ్‌నగర్‌లో రైతు పండుగ (Rythu Panduga Celebrations) ముగింపు వేడుక లో ఈ నిధులను విడుదల చేసి రైతుల్లో సంతోషం నింపారు. మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. రుణమాఫీలో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రుణమాఫీ జరగని 3.14 లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఈ నిధులు జమ అవుతాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటివరకూ రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందని.. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. ‘సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కోసం ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసి.. నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు వలస వెళ్లాయి. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి చేసిందా.?. ఈ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే.. రూ.500 బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది. ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం ఇది. అన్నదాతలకు ఉచిత కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీది.’ అని రేవంత్ తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను అమ్మి రుణమాఫీ చేసిందని, అది కూడా రూ.11 వేల కోట్లే అని ఆరోపించారు సీఎం రేవంత్. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే రాష్ట్రంలోని 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. ఏడాది పాలనలో రైతుల కోసం రూ. 54 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు దఫాలుగా మాఫీ చేయలేకపోయారని విమర్శించారు. ఒకవేళ కేసీఆర్ తొలి ఏడాది రుణమాఫీ చేసి ఉంటే వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండాపోయేదన్నారు. రుణమాఫీపై ప్రధాని మోదీ, కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతు బీమా, మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు ఏమిటో తనకు తెలుసన్నారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Arvind Kejriwal : ఢిల్లీలో కేజ్రీవాల్‌పై లిక్విడ్ దాడి.. నిందితుడు అరెస్ట్