Site icon HashtagU Telugu

CM Revanth: అంగ‌న్వాడీ విద్యార్థుల కోసం ప్రత్యేక యూనిఫామ్ విడుద‌ల చేసిన సీఎం రేవంత్‌

CM Revanth

CM Revanth

CM Revanth: హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) హాజరయ్యారు. ఇందులో భాగంగా వేదికపై ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థుల కోసం ప్రత్యేక యూనిఫామ్, పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సర కాలంలో విద్యార్థుల కోసం చేసిన గణనీయమైన మార్పులు, డైట్ చార్జీల పెంపు అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటి గ్రేటడ్ స్కూల్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలకు ఉచిత కరెంట్, తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం జరిగిందని సీఎం తెలిపారు. ఈనెల 14వ‌ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు జ‌రుగుతాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

Also Read: Weight Loss Drinks : పెళ్లయ్యాక బరువు పెరుగుతున్నారా.. ఈ డ్రింక్స్‌ బరువును అదుపులో ఉంచుతాయి..!

విద్యార్థుల‌తో మాక్ అసెంబ్లీ

బాలల దినోత్సవం సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో అధికారులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఎమ్మెల్యేలుగా యాక్ట్ చేస్తూ ప్రతిపక్షం, ప్రభుత్వ పక్షంగా విడిపోయి మాక్ అసెంబ్లీలో మాట్లాడారు. అనంత‌రం సీఎం రేవంత్ మాట్లాడారు. దేశంలో ప్రతిపేదవాడు చదువుకునేందుకు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విద్యా విప్లవాన్ని తీసుకువచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నెహ్రూ స్ఫూర్తితో విద్యా హక్కు చట్టాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చింది. రాజీవ్‌గాంధీ వల్లే 18ఏళ్లకే యువతకు ఓటుహక్కు వచ్చింది. శాసనసభకు పోటీచేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలి అని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభను సమర్థవంతంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రతిపక్షాలను సమన్వయం చేసుకుని సభను నడిపించాల్సి ఉంటుందన్నారు. ఈ అండర్-18 అసెంబ్లీని సమర్థవంతంగా నిర్వహించారని చిన్నారులను సీఎం రేవంత్ అభినందించారు.