కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ – 2, గ్రూప్ – 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని గత కొద్దీ రోజులుగా నిరుద్యోగులు (Unemployed) డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మరో నాల్గు రోజుల్లో DSC పరీక్షలు మొదలు అవుతున్నప్పటికీ నిరుద్యోగులు మాత్రం వెనకడుగు వెయ్యడం లేదు. రోజు రోజుకు తమ ఆందోళనలు ఉదృతం చేస్తూ వస్తున్నారు. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ (Hyderabad) లోని అశోక్‌నగర్‌లో భారీ ధర్నాకు దిగారు. రోడ్డును దిగ్భందం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతోందని నిరుద్యోగులు తేల్చిచెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు కీలక సూచన చేశారు. ‘కొందరు నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటున్నారు. మరికొందరు వద్దంటున్నారు. వారి సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైనా ఇబ్బంది ఉంటే మా మంత్రులను కలవాలి. తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం’ అని తెలిపారు. ఈరోజు గీత కార్మికులకు ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను(కాటమయ్య రక్ష కిట్లు) లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా నిరుద్యోగుల ఆందోళన పై స్పష్టం చేసారు. మరోపక్క నిరుద్యోగులు ఏ సమయంలో ఆందోళను చేస్తారోనన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్‌నగర్ నగర కేంద్ర గ్రంథాలయం పరిసరాల్లో మప్టీలో పోలీసు సిబ్బందితో పాటు వాహనాలతో పోలీసులు పహార ఏర్పాటు చేశారు. అలాగే నగరవ్యాప్తంగా కూడా పోలీసులు బందోబస్తు చేస్తున్నారు.
Read Also : Sai Durga Tej : ముఖమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో