Site icon HashtagU Telugu

Tirumala : నేడు తిరుమల శ్రీవారిని దర్శంచుకోనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy will visit Tirumala Srivara today

CM Revanth Reddy will visit Tirumala Srivara today

Chief Minister Revanth Reddy :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు సాయంత్రం తిరుపతి(Tirupati)కి వెళ్లి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. మనవడి తల నీలాలు సమర్పించేందుకు సీఎం కుటుంబంతో సహా తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం తిరిగి హైదరాబాద్‌కి సీఎం రేవంత్‌ రెడ్డి రానున్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బషీర్బాగ్లో పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పరిశ్రమలపై నేతలతో చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం తిరుపతికి పయనం కానున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ..నిన్న కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు నాలుగు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.

Read Also: Fear Politics : ఎన్నికల్లో పోటాపోటీగా ఫియర్ పాలి‘ట్రిక్స్’

అంతేకాక..కాల వర్షాలు కురుస్తుండటంతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రైతులు నష్టపోకుండా చివరి ధాన్యం వరకు ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. సన్నవాడ సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు 500 చొప్పున బోనస్ ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌ఎస్‌డీఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. తాత్కాలిక మరమ్మతులు చేసినా రైతులకు నీరు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.