Ranga Reddy District : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కొంగరకలాన్‌కు చేరుకోనున్న రేవంత్ రెడ్డి.. అక్కడ ఫాక్స్‌కాన్ కంపెనీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. 2023లో ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణకు వచ్చింది. కొంగర్‌కలాన్‌లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ నిర్ణయం తీసుకుంది. దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అప్పట్లో ఫాక్స్ కాన్ సీఈఓ యంగ్ లియు వెల్లడించారు.
Read Also: KTR : కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా.. నేడు కోర్టులో విచారణ
కాగా, సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో ఆనవాయితీగా నాగర్ కర్నూల్ జిల్లాలోని సొంతూరు కొండారెడ్డిపల్లెలో, ఆ తర్వాత ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం పర్యటించిన విషయం తెలిసిందే. కొడంగల్ పర్యటన అనంతరం నిన్న (ఆదివారం) మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న రేవంత్ నేరుగా బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యకమంలో పాల్గొని ప్రసంగించారు.