CM Revanth : తెలంగాణలోని ఫేక్ జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ జర్నలిస్టులు ముసుగు వేసుకొని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతామని ఆయన హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్నందున.. ప్రస్తుతం తాను, తనలాంటి బాధిత నేతలు ఓపిక పడుతున్నట్లు తెలిపారు. ‘‘సీఎం హోదాలో ఉన్నంత మాత్రాన అన్నీ భరిస్తూ కూర్చోను. చట్టప్రకారం అన్నీ చేస్తా. చట్టాన్ని దాటను’’ అని రేవంత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం గురించి, నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తోడ్కలు తీస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా పలువురి నీచ వ్యాఖ్యల వ్యవహారంపై స్పందిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Jwala Gutta : నితిన్‌తో ఐటమ్ సాంగ్.. మోకాలి వరకు డ్రెస్.. గుత్తా జ్వాల కామెంట్స్
కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు
‘‘కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. వాళ్లు హద్దు దాటినా, మాట జారినా దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాం. నాకు చికాకు వచ్చి ఒక్కమాట చెబితే మా పిల్లలంతా వారిని బట్టలు విప్పి కొడతారు’’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘‘నేను ఉన్నంతకాలం నిటారుగా, నిఖార్సుగా ఉంటా. ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోను’’ అని ఆయన తెలిపారు. ‘‘కొంతమంది మా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా? హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదు’’ అని సీఎం చెప్పారు. ‘‘ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా?’’ అని ఆయన ప్రశ్నించారు.
Also Read :Cash For Bed Rest: బెడ్ రెస్ట్ ఆఫర్.. 10 రోజులకు రూ.4.70 లక్షలు
జర్నలిస్టు అంటే ఎవరు.. నిర్వచనం ఇవ్వండి
‘‘నేను జర్నలిస్టు సంఘాలను కోరుతున్నాను.. జర్నలిస్టు అంటే ఎవరు అనే దానికి ఒక నిర్వచనం ఇవ్వండి.. జర్నలిస్టుల ధ్రువీకరణకు ప్రమాణం ఏమిటో చెప్పండి.. ఆ ప్రమాణం లేని వాళ్లను క్రిమినల్స్‌గా పరిగణిస్తాం. ఏది పడితే అది మాట్లాడితే గుడ్డలు ఊడదీసి కొడతాం’’ అని రేవంత్ ఆగ్రహంతో చెప్పారు. ‘‘ఐ అండ్ పీఆర్ శాఖ వారికి నా రిక్వెస్టు. ఈవిషయంలో జర్నలిస్టు సంఘాలతో చర్చించండి. జర్నలిస్టుల గుర్తింపునకు అవసరమైన నిర్దిష్ట ప్రమాణాన్ని తేల్చండి’’ అని ఆయన సూచించారు. ‘‘ఐ అండ్ పీఆర్ ఆమోదం.. డీఏవీపీ పత్రికలు, ప్రసారా సాధనాలున్నవారే జర్నలిస్టులా? లేక యూట్యూబ్ పెట్టుకుని ఏదిపడితే అది మాట్లాడే వారు జర్నలిస్టులా ? మాకు జర్నలిస్ట్ సంఘాల నాయకులే క్లారిటీ ఇవ్వాలి. నాకు రక్తం మరుగుతోంది. మీకు కుటుంబాలు లేవా? భార్య పిల్లలు లేరా?’’ అని రేవంత్ (CM Revanth) ఫైర్ అయ్యారు.
దారుణమైన బూతులు ఉంటున్నాయి
‘‘తెలంగాణ సమాజం ఇదేనా? రజకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదురించి నిలబడిన వాడు మొనగాడు. అలాంటి ప్రాంతాన్ని నాశనం చేసి, విష సంస్కృతిని ఉసిగొల్పాలని చూస్తే ఉరికిచ్చి కొడతాం’’ అని సీఎం తేల్చి చెప్పారు. ‘‘జైలుకు పోతే బెయిల్ వస్తదని అనుకుంటే చట్టాలను సవరిస్తాం. ఆడపిల్లల ఫ్లాట్ ఫామ్‌లో దారుణమైన బూతులు ఉంటున్నాయి. వీటిని క్షమించే ప్రసక్తే లేదు’’ అని రేవంత్ తెలిపారు.