Telangana CM Office: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి పరంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికార యంత్రాంగాన్ని క్రమబద్ధీకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆఫ్ తెలంగాణని సందర్శించిన సీఎం అధ్యాపకులతో సంభాషించారు.సంస్థ పనితీరు మరియు కార్యకలాపాలతో పాటు ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయెల్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికి ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలు మరియు సేవలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి సోలార్ బ్యాటరీతో నడిచే వాహనంలో ఇన్‌స్టిట్యూట్ ఆవరణలోని వివిధ బ్లాకులను చుట్టి వచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.ఆయన ప్రగతి భవన్ లో ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
Also Read: Article 370 : కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు ఇవాళే