ధరణి పోర్టల్ (Dharani Portal) ఫై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) ఏ నిర్ణయం తీసుకుంటారో అనే టెన్షన్ అందరిలో నెలకొంది. రాష్ట్ర రెండో సీఎం గా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే తన మార్క్ కనపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరిచాడు. గత ప్రభుత్వానికి భిన్నంగా..ప్రజా సమస్యలు వింటూ వాటిని పరిష్కరిస్తూ ప్రజా క్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే విద్యుత్, టీఎస్పీఎస్సీ, రైతు బంధు అంశాలఫై సమీక్షలు జరిపిన సీఎం..నేడు ధరణి పోర్టల్ ఫై సమీక్ష జరపనున్నారు. ఈ సమీక్ష లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఉన్నంతధికారులు పాల్గొనునున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ముందు నుండి కూడా రేవంత్ ధరణి విషయంలో ఆగ్రహంగా ఉన్నారు. ధరణి లో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి సయితం ఎన్నికల వేళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ అనుచరులకు భూములను కట్టబెట్టడం కోసం ధరణని తెచ్చారని కూడా విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో కొత్తది తెస్తామని ప్రకటించారు. మహ్మతా జ్యోతిబాపూలే భవన్లో నిర్వహిస్తోన్న ప్రజా దర్బార్‌లో సైతం ఎక్కువగా ధరణి పోర్టల్‌పైనే ఫిర్యాదులు రావడంతో రేవంత్ దీనిపై మరింత దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈరోజు మధ్నాహ్నం సచివాలయంలో ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించున్నారు. ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీ వేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌పై తదుపరి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక, అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించడంతో.. ఇవాళ్టి సమీక్షపై ఉత్కంఠ నెలకొంది. మరి ఈ సమీక్షలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
Read Also : CM Revanth: రాయదుర్గం-శంషాబాద్ మెట్రో విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం