T Congress : ‘చేయూత ‘, ‘మహాలక్ష్మి’ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకాన్ని (Mahalakshmi Scheme) సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 01:54 PM IST

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిని మొదలుపెట్టింది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ‘మహాలక్ష్మి’ పథకాన్ని (Mahalakshmi Scheme) సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు. అలాగే చేయూత పథకం (Cheyutha Scheme) కింద ఆరోగ్య శ్రీ లిమిట్ ను రూ.10 లక్షలకు పెంచారు. ‘అందరికీ వైద్యం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ’ పేరుతో ఇది ఈరోజు నుండే అమల్లోకి రానుంది. 6 గ్యారెంటీల అమల్లో భాగంగా తొలుత ఈ రెండు పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. పచ్చజెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఇకపై తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ, బాలికలు, యువతులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు చూపించిన మహిళలకు జీరో టికెట్ ఇస్తారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. అంతర్‌ రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద ప్రయాణించాలనుకునే వారు స్థానికతకు సంబంధించిన ఆధార్‌, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పలు గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్యశ్రీ లిమిట్ ను సైతం పెంచారు. ఇప్పటివరకు రూ. 5 లక్షల వరకు పరిమితి ఉండగా..ఇప్పుడు దీనిని రూ. 10 లక్షలకు పెంచారు. ‘అందరికీ వైద్యం – రాజీవ్ ఆరోగ్యశ్రీ ‘ పేరుతో ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Read Also : Sonia Gandhi Birthday : సోనియమ్మ బర్త్ డే వేళ.. తెలంగాణకు రెండు గిఫ్ట్స్