కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చేసిన కామెంట్స్ ఫై సీఎం రేవంత్ (CM Revanth Reddy)స్పందించారు. మేడిగడ్డ (Madigadda) వద్ద నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం మాట్లాడుతూ..చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్ ఇంకెన్ని రోజులు చెబుతాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి వచ్చి నిజాలు చెప్పాలని సవాల్ చేశారు. తెలంగాణ కోసం చచ్చేవరకు కొట్లాడానని చెబుతున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చ పెడితే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నాలుగైదు పిల్లర్లు కూలితే పెద్ద సమస్యా? అని అంటున్నారు.. కళ్లకు కట్టినట్లు పగుళ్లు కనిపిస్తుంటే చిన్న సమస్య ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. నీళ్లు నింపితే మొత్తం ప్రాజెక్ట్ కూలిపోతుందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని చెబుతున్నారని, అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారని, నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ(Dam Safety Authority) వివరించిందని సీఎం తెలిపారు. 2020-21లోనే సమస్య ఉందని ఇంజినీర్లు చెప్పారన్న సీఎం, సమస్యను చక్కదిద్దే పని చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు అని , కాళేశ్వరం రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25 వేల కోట్లు అవసరమని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఏ బ్యారేజీలోనూ ఇప్పుడు నీరు లేదని, మేడిగడ్డ, సుందిళ్ల(Sundilla Project), అన్నారం బ్యారేజీల్లో ఒకే తరహా సమస్య ఉందని రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీపేజీ చేసి అన్నారం, సుందిళ్లలో సమస్యను కప్పిపుచ్చారని తెలిపారు. వానాకాలం నీరు వస్తే, సుందిళ్ల, అన్నారంలో కూడా సమస్యలు బయటడపడతాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యిందని చెప్పిన మరుసటి సంవత్సరమే సమస్యలు బయటడ్డాయని, అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని రేవంత్ దుయ్యబట్టారు.
కేవలం కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైపోయిందని రేవంత్ ఆరోపించారు. అడిగితే సలహాలు ఇస్తానని ఇప్పుడు చెబుతున్నాడు.. సభకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని సెటైర్ వేశారు. సక్కగ లేని తీర్మాణానికి అసెంబ్లీలో హరీష్ రావు ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. హరీష్ రావు మాటలకు విలువ లేదా? అని అడిగారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం గురించి ఎందుకు ప్రస్తావించలేదు అని అన్నారు. సీఎం కుర్చీ పోగానే నల్లగొండ నీళ్లు, ఫ్లోరైడ్ బాధితుల బాధలు ఎందుకు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ గౌరవాన్ని తాము తగ్గించబోమని.. కానీ, చేసే సూచనలు అసెంబ్లీకి వచ్చి చేయాలని సూచించారు.
Read Also : KCR Nalgonda Speech : ఎన్ని గుండెల్రా మీకు అంటూ కాంగ్రెస్ నేతలఫై కేసీఆర్ ఆగ్రహం