Digital Health Cards : రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్‌కార్డులు – సీఎం రేవంత్

దావోస్ పర్యటనలో బిజీ బిజీ గా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Redddy)..అక్కడి సదస్సులో ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు (Digital Health Cards) అందించనున్నామని, ఈ మేరకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులను రూపొందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వబోతున్నామని..రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అత్యుత్తమ వైద్యసేవలకు, […]

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Digital Health C

Cm Revanth Digital Health C

దావోస్ పర్యటనలో బిజీ బిజీ గా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Redddy)..అక్కడి సదస్సులో ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు (Digital Health Cards) అందించనున్నామని, ఈ మేరకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులను రూపొందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వబోతున్నామని..రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధాని అని, అయితే నాణ్యమైన వైద్యసేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నదని రేవంత్ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

డిజిటల్‌ హెల్త్ కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతామని ఈ సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత సహాయంతో నాణ్యమైన వైద్యసేవలను అందించనున్నామని ఆయన చెప్పారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని రేవంత్ ప్రస్తావించారు. ఇక అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధానిగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌ నగరంలో తయారవుతున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ప్రసంగించారు.

ఇక రేవంత్ టీమ్‌ దావోస్‌ పర్యటన తెలంగాణకు పెట్టుబడుల వరదను పారిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో భేటీ అయ్యి.. వరంగల్‌ నగరానికి విప్రో కంపెనీ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. అంతకుముందు టాటాసన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, గ్లోబల్‌ హెల్త్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియం వార్‌, ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు.

Read Also : Mahesh Babu : అయిదు సినిమాలతో ఆ రికార్డ్ సెట్ చేసిన ఏకైక హీరో మహేష్.. ఏంటా రికార్డ్?

  Last Updated: 18 Jan 2024, 09:46 AM IST