CM Revanth: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు.. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటూ ఆకాంక్ష

  • Written By:
  • Updated On - April 8, 2024 / 06:33 PM IST

CM Revanth: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

ఇక ఉగాది పండుగను ప్రతి సంవత్సరం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. అంతేకాకుండా ఈరోజు పంచాంగం లో భాగంగా కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితులు రాశి ఫలాలు కూడా తెలుసుకుంటారు. అలాగే ఉగాది రోజున హిందువులంతా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పిండివంటలతో పాటు ఉగాది పచ్చడిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగనే కొత్త సంవత్సరంగా భావిస్తారు. తాము ప్రారంభించాలనుకున్న పనిని ఉగాది పర్వదినం రోజున సెంటిమెంట్ గా భావించి కార్యరంగంలోకి దిగుతారు.

Also Read: 6 Thousand Pension : దివ్యాంగులకు రూ.6 వేల పింఛను – చంద్రబాబు ప్రకటన