CM Revanth Reddy: ప్రైవేట్ వర్సిటీల రిజర్వేషన్ విధానంపై విచారణ

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేట్‌ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగ

CM Revanth Reddy: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేట్‌ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగ బాధ్యత అని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడుచుకోవడం సరికాదని సీఎం ఫైర్ అయ్యారు. అవసరమైతే ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో ఈ రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మన ఊరు-మన బడి కార్యక్రమం కింద జరిగిన నిధుల ఖర్చుపై లోతుగా విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటి వరకు ఈ నిధుల వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కనీస సౌకర్యాలు లేక అర్హులైన సిబ్బంది లేకుండానే అనేక విద్యాసంస్థలు నడుస్తున్నాయని, ఈ యూనివర్సిటీలు వివాదాస్పద భూముల్లో ఏర్పాటు చేయడం వల్ల చాలా మందికి ఇబ్బందులు కలుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, ఫీజు కట్టడాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాలు, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్హతలను పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Also Read: Vinesh Phogat: ఫుట్‌పాత్‌పై వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు