తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి సరిగ్గా నేటికీ ఏడాది(CM Revanth Reddy One Year Ruling) పూర్తయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం(CM Revanth Reddy) చేసిన రోజు నుండి పాలనలో తన మార్క్ కనపరుస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో కొత్త మార్గాలను అనివేశిస్తు ముందుకు సాగుతూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి, వాటి అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు.
ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. వేలాది మంది యువతకు ఉద్యోగ సాధనలో సహాయం జరిగింది. అదేవిధంగా, గ్రామ సమృద్ధి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయరంగానికి ఊతమిచ్చే విధానాలు రేవంత్ పాలనలో ప్రధానంగా నిలిచాయి. ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ , సన్న వడ్లకు రూ. ఐదు వందలు బోనస్ ఇచ్చి ఆకట్టుకున్నారు.
రేవంత్ పాలన ప్రధాన ఫోకస్ రైతుల సంక్షేమంపై ఉండటం విశేషం. రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు రైతులకు ఎంతో మేలు చేశాయి. పైగా, సాగునీటి సమస్యలను తీర్చడంలో సమర్ధవంతమైన చర్యలు తీసుకున్నారు. వీటితోపాటు, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, రైతులకు ఆర్థిక భరోసా కల్పించారు. విద్య, ఆరోగ్యం రంగాల్లో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సదుపాయాలు మెరుగుపర్చడం, నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించడం వంటి కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది.
రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు, యువత సమస్యలపై చర్యలు ప్రత్యేకంగా కనిపించాయి. నిరుద్యోగ భృతి అమలు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, స్టార్ట్‌అప్‌లకు ప్రోత్సాహం వంటి చర్యల ద్వారా యువతకు కొత్త ఆశలు నింపగలిగారు. మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ఆర్థిక సాయం, స్వయం సహాయక గ్రూపులకు మద్దతు అందించారు. మొత్తంగా, రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు హైలైట్‌గా నిలిచాయి.
కాకపోతే కొన్ని నిర్ణయాలు మాత్రం రేవంత్ రెడ్డి పై విమర్శలకు దారితీసాయి. అందులో ఒకటి హైడ్రా, రెండు మూసి ప్రక్షాళన. హైడ్రాతో పెద్ద వాళ్ల ఆక్రమణల్ని కూల్చివేసినప్పుడు అందరూ జేజేలు కొట్టారు. ఎప్పుడైనా మధ్యతరగతి ఇళ్లజోలికి వెళ్లారో అప్పుడే రివర్స్ అయింది. దాంతో హైడ్రా బుల్డోజర్లను షెడ్డుకు పంపాల్సి వచ్చింది. మూసి విషయంలోనూ అంతే. డబుల్ బెడ్ రూంలు ఇచ్చి మూసి జనాల్ని ఖాళీచేయించాలనుకున్నారు కానీ ముందుకు సాగలేదు. ఇప్పుడు రెండు విషయాల్లో కోర్టుల నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఎటు వైపు నుంచి ప్రారంభించాలో తెలియక.. ప్రారంభిస్తే ఏమవుతుందోనని కంగారు పడుతున్నారు.
ఫ్రీ బస్సు పథకం వల్ల మగవారు ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు..దీని పై కూడా విమర్శలు వచ్చాయి. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా చాలామందికి డబ్బులు పడడంలేదని గగ్గోలు పెడుతున్నారు. దళిత బంధు విషయంలో కూడా నిరసనలు వస్తున్నాయి. ఇలా కొన్ని విషయాలు మాత్రం రేవంత్ పై కాస్త నెగిటివిటీ ఉంది..ఓవరాల్ గా మాత్రం ఏడాది పాలనలో తన మార్క్ కనపరిచారు.
Read Also : Cock Fighting : సంక్రాంతికి పందెం కోళ్లు రెడీ.. స్పెషల్ ఫుడ్‌తో ట్రైనింగ్.. హైరేంజులో రేట్లు
