Site icon HashtagU Telugu

Telangana Assembly : ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

Ktr Revanth

Ktr Revanth

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. బిఆర్ఎస్ మాజీ మంత్రి , ఎమ్మెల్యే కేటీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని చెపుతూనే..బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి..చేసిన పనుల గురించి చెప్పుకొస్తున్నారు.
ఈ సందర్భాంగా భట్టి సీఎం అవుతారని అనుకున్న కానీ…అయన కాలేదు.. ఢిల్లీ నామినేట్ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ కేటీఆర్ తనదైన శైలి లో కామెంట్స్ చేసారు. ఆయన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ రిప్లై ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

తనను ఎన్ఆర్ఐ అని రేవంత్ కామెంట్ చేశారని…. ఎన్నారైని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షురాలిని చేసింది ఏ పార్టీనో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.కంచెలు తీసినం అని బిల్డప్ ను నమ్మరు…కంచెలు వేసింది …కాంగ్రెస్ హయంలోనేనని గుర్తు చేశారు. ఇప్పటికీ మూడు క్యాబినెట్ మీటింగ్ లు అయ్యాయి…హామీల అమలు ఊసు లేదన్నారు.BRS హయాంలో ITIR లేకున్న సాధించామని…అసలు ITIR అంటే ఏంటో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు తెలుసా ? అని ప్రశ్నించారు.

కొత్త రైతుబంధు కోసం రైతులు , కౌలు రైతులు ఎదురుచూస్తున్నారని ప్రస్తావించారు. సూపర్ లగ్జరీ బస్సులో కూడా ఉచిత ప్రయాణం అన్నారు..కానీ ఆర్డినరీ , పల్లె వెలుగు , ఎక్స్ ప్రెస్ లలో మాత్రమే ఉచిత ప్రయాణం కలిపిస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తమ పాలనలో రాష్ట్రానికి అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ సమకూర్చమని కేటీఆర్ తెలిపారు. మేం రూ.81 వేల కోట్లు అప్పు చేశామని అసత్య ప్రచారం చేస్తున్నారు. రూ. 1 .37 లక్షల కోట్లు ఆస్తులు సృష్టించి మీకు అప్పగించాం అని కేటీఆర్ అన్నారు.

Read Also : CM Revanth Counter to KTR : కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్