CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మాజీ మంత్రి జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించనున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ నేృత్వంలోని శాంతి చర్చల కమిటీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. మావోయిస్టుల అంశాన్ని తాము సామాజిక కోణంలోనే చూస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జానారెడ్డి సలహాలు తీసుకుంటామని కమిటీతో చెప్పారు.
Read Also: Vishwak Sen : త్వరలోనే పెళ్లి చేసుకోబోతునన్ విశ్వక్ సేన్.. లవ్ మ్యారేజ్ మాత్రం కాదు..
ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయమే జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆపరేషన్ కగారు పై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మావోలతో శాంతి చర్చలు జరిగిన విషయం తెల్సిందే. అప్పట్లో జానారెడ్డి కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి సలహాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
కాగా, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఈ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని నేతలు కోరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ వినతిపత్రం అందజేశారు.
Read Also: Pakistan : వీళ్లు ప్రజాప్రతినిధులు కాదు..ఉగ్రవాదులు !