Site icon HashtagU Telugu

CM Revanth Lunch : సామాన్యుడి ఇంట్లో సామాన్య వ్యక్తిలా సీఎం భోజనం

Revanth Reddy Lunch

Revanth Reddy Lunch

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ (Fine Rice Distribution) కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన పొందుతోంది. నిరుపేద కుటుంబాల భోజన అవసరాలను తీర్చేందుకు ఈ పథకం ఎంతో కీలకంగా మారింది. ప్రజలతో ప్రభుత్వానికి బంధాన్ని మరింత బలపరిచేందుకు ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఈ క్రమంలో పలువురు మంత్రులు ఇప్పటికే ఆచరణలోకి దిగారు.

Bullet Bikes : డుగ్.. డుగ్.. ఫట్.. ఫట్.. బుల్లెట్ బైక్‌లపై కొరడా

ఈ నేపథ్యంలో శ్రీరామనవమి (Sriramanavami) సందర్భంగా ఏప్రిల్ 6న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) భద్రాచలంలో శ్రీరాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చేరుకుని, లబ్ధిదారుడు బూరం శ్రీనివాసరావు ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేయడం ద్వారా సామాన్యుడిలా వ్యవహరించిన సీఎం, ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు.

Nithyananda : నిత్యానంద స్వామి లొకేషన్ అదే.. ఎక్కడికీ వెళ్లలేడు !?

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పోలీసు ఉన్నతాధికారులు భద్రతను పర్యవేక్షించారు. భద్రాచలం ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సీతారాములవారికి కూడా పట్టువస్త్రాలు సమర్పించడంతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క దంపతులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.