Indiramma Houses : ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం నారాయణపేట జిల్లాలోని అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇళ్లు మంజూరు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం. అర్హులైన లబ్దిదారులు స్వంతంగా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇంటి నిర్మాణానికి పూర్తి రాయితీతో రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. బేస్మెంట్ కట్టగానే లక్ష రూపాయలను లబ్దిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
Also Read :Taj Banjara Hotel: ‘తాజ్ బంజారా’ హోటల్ సీజ్.. కారణం ఇదే..
ప్రత్యేకంగా వెబ్‌సైట్
ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Houses)లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. తమ దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకునేందుకు ప్రజలు https://///indirammaindlu. telangana.gov.in/applicantsearch వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. గూగుల్‌లోకి వెళ్లి ఈ వెబ్‌సైటును ఓపెన్ చేయాలి. అనంతరం దానిలో ఆధార్ కార్డు నంబరును ఎంటర్ చేయాలి. దీంతో దరఖాస్తు ప్రస్తుత స్టేటస్ కనిపిస్తుంది. ఫోన్ నంబరు ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అనంతరం పేరు, చిరునామా, ఇతర వివరాలను నమోదు చేయాలి. తదుపరిగా ఫిర్యాదుల కేటగిరి ఆప్షన్ డ్యాష్ బోర్డుపై కనిపిస్తుంది. ఇందులో దరఖాస్తుదారుడు తాను ఎదుర్కొన్న సమస్యను అందులో ప్రస్తావించవచ్చు. అక్కడ కింది భాగంలో ఉన్న బాక్స్‌లో ఫిర్యాదు వివరాలు రాయాలి. అనంతరం స్థలం లేదా ఇతర ధ్రువపత్రాలు 2 ఎంబీ సైజు వరకు పీడీఎఫ్, పీఎన్‌జీ, జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. చివరగా ఫిర్యాదు నంబరు వస్తుంది. దాన్ని సేవ్ చేసుకోవాలి.
Also Read :Israel Blast: దద్దరిల్లిన సెంట్రల్ ఇజ్రాయెల్… మూడు బస్సుల్లో వరుస పేలుళ్లు
ఇందిరమ్మ ఇల్లు లిస్ట్2
శాశ్వత తెలంగాణ వాసి అయి ఉన్న వారే దీనికి అర్హులు. వారి కుటుంబం మిడిల్ క్లాస్‌కు చెందినదై ఉండాలి. దరఖాస్తు దారుడు ఇది వరకు ఎప్పుడూ ఏ హౌసింగ్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకుని ఉండకూడదు. అతనికి సొంత ఇల్లు ఉండకూడదు. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, రేషన్ కార్డు, అప్లికేషన్ ఐడీ నంబర్‌లను సమర్పించాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040- 29390057 ఫోన్ చేయవచ్చు. ఇందిరమ్మ ఇల్లు 2024 డిసెంబర్ 5న ప్రారంభించారు. అధికారిక వెబ్‌సైట్ www.Indiramma Illu చెక్ చేసుకోవచ్చు.