Site icon HashtagU Telugu

CM Revanth Reddy : గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం

CM Revanth Reddy invitation to Governor Radhakrishnan

CM Revanth Reddy invitation to Governor Radhakrishnan

Telangana Formation Day: తెలంగాణ గవర్నర్‌ రాధా కృష్ణన్(Governor Radha Krishnan) ను సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు ఉదయం కలిసారు. ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తో కలిసి రాజ్‌భవన్‌(Raj Bhavan) వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి ఈ మేరకు వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించారు.

We’re now on WhatsApp. Click to Join.

రేపు( జూన్‌2) ఉదయం 9.30 గంటలకు గన్‌ పార్క్‌(Gun Park)లో అమర వీరుల స్థూపం(Telangana Martyrs Memorial) వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. తెలంగాణ దశాబ్ది వేడుకలను ప్రభుత్వం రెండు పూటలా నిర్వహించనుంది.

Read Also: Manamey Trailer : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ చూసారా..?

రేపు సాయంత్రం ట్యాంక్ బండ్‌(Tank Bund)పై తెలంగాణ దశాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌పై ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ ఫుల్ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. ఇదే వేదికపై తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా ఫైర్ వర్క్స్‌తో వేడుకలను ముగిస్తారు.