CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్న ఆయన.. నేడు (బుధవారం), రేపు (గురువారం) ఢిల్లీలోనే ఉంటారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో ఆయన భేటీ అవుతారని తెలిసింది. ఈసందర్భంగా తెలంగాణలో మంత్రిమండలి విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో సీఎం సహా 12 మంది ఉన్నారు. ఖాళీగా ఉన్న మరో 6 మంత్రి పదవుల్లో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పార్టీ పెద్దల సూచనలను రేవంత్ తీసుకోనున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీలో సీనియారిటీ, అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని మంత్రి పదవులకు నేతలను ఎంపిక చేస్తారని సమాచారం.
Also Read :President Arrested : తెల్లవారుజామునే దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్.. ఎందుకో తెలుసా ?
మంత్రి పదవుల రేసులో వీరే..
- ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి(CM Revanth Reddy) పదవిని ఆశిస్తున్నారు.
- ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎవరికీ రాష్ట్ర మంత్రి మండలిలో అవకాశం దక్కలేదు. దీంతో మల్‌రెడ్డి రంగారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు.
- మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందనే ఆశాభావంతో షబ్బీర్ అలీ ఉన్నారు.
- ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క మంత్రి కూడా లేదు. దీంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరుతున్నట్లు సమాచారం.
- ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు.ఆయన అన్న పెద్దపల్లి ఎమ్మెల్యే వినోద్ కూడా పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో కనీసం ఒక్కరికి అవకాశం దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది.
- త్వరలో భర్తీ చేయనున్న 6 మంత్రి పదవుల్లో ఒకటి లంబాడీ సామాజిక వర్గానికి, మరొకటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారట. ఈ లెక్కన వివేక్, వినోద్ సోదరుల్లో ఒకరికి బెర్త్ ఖాయం అనిపిస్తోంది.
Also Read :Population Control Vs Chandrababu : ఎక్కువ మంది పిల్లల్ని కనడం తప్పేం కాదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్ సింగపూర్, దావోస్ టూర్
- రేపు (గురువారం) ఉదయం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలవనున్నారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అభివృద్ది పనులపై వారితో చర్చిస్తారు.
- గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్‌కు వెళ్తారు. ఈనెల 19 వరకు అక్కడే ఉంటారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యానికి పలు సింగపూర్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై పలు సింగపూర్ కంపెనీలతో చర్చించనున్నారు.
- ఈనెల 20 నుంచి 22 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తారు.
- ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న క్వీన్స్‌ల్యాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలోని బృందం సందర్శించనుంది. 1911లో ప్రారంభమైన ఈ వర్శిటీ ఆస్ట్రేలియాలో ఎందరినో మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దింది.