తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను అమలు చేసిన సర్కార్..ఈ నెలాఖరుకల్లా మరో స్కీమ్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. నెలాఖరులోగా మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆర్థక శాఖతో చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేసేలా చూడాలని అధికారులు ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గా దావోస్ పర్యటన పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన సీఎం..ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై..కేటీఆర్ ఫై నిప్పులు చెరిగారు. గుంపు మేస్త్రీ అంటూ చేస్తున్న కామెంట్స్ ఫై స్పందిస్తూ.. ”అవును.. నేను మేస్త్రీనే. మీరు విధ్వంసం చేసిన తెలంగాణని పునర్ నిర్మాణం చేస్తున్న మేస్త్రీ నేనే. ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తాను. కాస్కోండి. కేసీఆర్ ఎవరిని రాజ్యసభ సభ్యులను చేశారు? దోచుకున్న వాళ్ళకి పదవులు ఇచ్చారు. 50వేల రూపాయలు లేకున్నా 52వేల మెజార్టీ సాధించిన సామేలుకు మేం టికెట్ ఇచ్చాం” అని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అలాగే రైతుబంధు విషయంలో కూడా ఓ కీలక ప్రకటన చేసారు రేవంత్. గతేడాది వానాకాలం సీజన్లో 70.54 లక్షల మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు వేయగా ఈసారి యాసంగి సీజన్ రైతు బంధు మాత్రం 63 లక్షల మంది రైతులకు మాత్రమే ఫిబ్రవరి నెలాఖరు వరకు వేస్తామని ప్రకటించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన సత్తాను.. లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపించాలని పార్టీ కార్యకర్తలు, నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఒక వైపు పాలన చూసుకుంటూనే మరోవైపు.. ప్రజల్లో ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also : Pushpa 2 Postponed: పుష్ప పార్ట్ 2 వాయిదా పడినట్టేనా?