KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై, కాంగ్రెస్ నేతల వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. ఈ-కార్ రేసు కేసు (E-car race case)తమపై మోపిన ఆరోపణలు ఆధారహీనమని ఆ కేసులో ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్‌కే తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను ఏ తప్పూ చేయలేదు. కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్‌కైనా సిద్ధంగా ఉన్నా అని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మార్చిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా కేటీఆర్ కఠిన విమర్శలు చేశారు. దానం నాగేందర్‌ని రాజీనామా చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశ్యం కడియం శ్రీహరీని రక్షించడం మాత్రమేనని ఆయన ఆరోపించారు.
Jan Suraaj Party : మాకూ రూ.1000 ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి!
స్పీకర్ ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం పెద్ద ఇబ్బందుల్లో పడుతుందని ఆ అవమానాన్ని తప్పించుకోవడానికే కాంగ్రెస్ ఈ రాజీనామా నాటకానికి తెరలేపిందని ఘాటుగా విమర్శించారు. ముందుగానే కొందరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు దారి తీసే ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేసుకుందని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల షెడ్యూల్‌పై కూడా కేటీఆర్ విశ్లేషణ కొనసాగింది. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆ తర్వాతే ఉపఎన్నికలు నిర్వహిస్తారని ఆయన అంచనా వేశారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ప్రజా సమస్యలను మాత్రం పక్కకు నెట్టేస్తోందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అవసరమైన సేవలు, అభివృద్ధి చర్యలు, ప్రాథమిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కుతంత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్లడం కాదు తిరిగి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమపై తప్పుడు కేసులు పెట్టడం ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. “రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గాయి, పరిశ్రమలు వెనుకంజ వేస్తున్నాయి యువత అవకాశాల కోసం అసహనంగా ఎదురుచూస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రతీకారాలతో బిజీగా ఉంది” అని విమర్శించారు. పార్టీ బలాన్ని నిలబెట్టేందుకు, ప్రజా మద్దతును పెంపొందించేందుకు బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు చేపడుతుందని తాను ఎలాంటి ఒత్తిడులకు లొంగనని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు, విచారణలతో తనను భయపెట్టలేరని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో ఎన్నికలు చూపిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ చేసిన తప్పులను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రతి చర్యకూ సమాధానం ఇవ్వాల్సిన రోజు వారిపై వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కేటీఆర్ సవాలు ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతోంది అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
