Site icon HashtagU Telugu

CM Revanth Reddy : అధికారంకన్నా మానవత్వమే మిన్న అని నిరూపించుకున్న సీఎం రేవంత్

Revanth Reddy Convoy

Revanth Reddy Convoy

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన హోదా, అధికారంకన్నా మానవత్వమే మిన్న అని నిరూపించుకున్నాడు. శనివారం సీఎం తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్దకు చేరుకోగానే… అదే సమయంలో ఓ అంబులెన్స్ అటుగా రావడం కనిపించింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్ కు దారివ్వాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్ కు (Convoy Gives way to Ambulance) దారిచ్చింది. అటుగా వెళుతున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా సీఎం ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటికీ..రాష్ట్రాన్ని పాలించే బాధ్యత తన వద్ద ఉన్నప్పటికీ ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తుండడం అయన గొప్పతనం అంటూ కామెంట్స్ వేస్తున్నారు. సీఎంగా బాధ్యత చేపట్టిగానే రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తాను వెళుతున్న సమయంలో ఎక్కువ సేపు ట్రాఫిక్ ఆపి సామాన్యులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. మాటల్లోనే కాదు ఇప్పుడు చేతనల్లోనూ తమది ప్రజాప్రభుత్వం అని నిరూపించారు.

Read Also : MLA Chanti babu Meets Pawan : పవన్ కళ్యాణ్ ను కాకినాడ ఎంపీ సీటును కోరిన వైసీపీ ఎమ్మెల్యే..