Site icon HashtagU Telugu

Revanth Reddy : నెక్స్ట్ కూడా నేనే సీఎం- రేవంత్ కు అంత ధీమా ఏంటి..?

Next Cm Revanth

Next Cm Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన పాలనలో ఏడాది పూర్తిచేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో కొన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నప్పటికీ, మరికొన్నింటిలో ఇంకా స్పష్టత రాలేదు. ఇదే అంశంపై ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS) విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని ఆరోపిస్తోంది. అయితే శాసనసభ వేదికగా రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలకు సమాధానం ఇస్తూ తాను వచ్చే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగానే కొనసాగుతానని ధీమాగా ప్రకటించారు.

AR Rahman : ఏఆర్ రెహమాన్‌కు ఛాతీనొప్పి.. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స

రెండోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తానే మళ్లీ సీఎం అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోన్నప్పటికీ, BRS క్షేత్రస్థాయిలో బలం కోల్పోతుందనే అంచనాలు, అలాగే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) విజయాలు సాధించడం, రేవంత్ ధీమాకు కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ తన బలాన్ని నిలబెట్టుకోవడం, BRS పతనం కావడం, BJPతో పోటీ నెలకొనడం వంటి అంశాల నేపథ్యంలో, రేవంత్ రెడ్డి తన భవిష్యత్‌పై నమ్మకంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Ajwain : పరగడపున వాముని తీసుకుంటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు

ఒకవేళ రేవంత్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, తెలంగాణలో వరుసగా రెండుసార్లు సీఎం అయ్యే రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటి వరకు ఈ ఘనత కే. చంద్రశేఖర్ రావు (KCR) కే దక్కింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి KCR తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో సాగాలని భావిస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో నిజంగా ఆయన ఈ గెలుపును కొనసాగించగలరా? లేదా? అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.