Site icon HashtagU Telugu

CM Revanth – 2 Brothers : సీఎం రేవంత్ సోదరులకు ఎంపీ టికెట్స్.. నిజమేనా ?

Cm Revanth 2 Brothers

Cm Revanth 2 Brothers

CM Revanth – 2 Brothers : ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు నిలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఈటల రాజేందర్‌ను బీజేపీ బరిలోకి దింపుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేయనున్నారు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్‌ కోసం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డి కూడా పోటీపడతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ సీటు కొండల్ రెడ్డికి ఖరారైందంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఇంకొందరైతే కొండల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ  ఫ్లెక్సీలు సైతం పెట్టారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్‌ను మైనంపల్లి హనుమంత రావు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన హనుమంతరావు..  ఇటీవల కాంగ్రెస్ తరఫున మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మల్లారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి ఎంపీగా పోటీ చేసి సత్తా చాటాలనే పట్టుదలతో మైనంపల్లి హనుమంత రావు ఉన్నారు. బీజేపీ నుంచి ఈటల బరిలోకి దిగుతుండగా.. రేవంత్ సోదరుడికి టికెట్ ఇస్తారా ? మైనంపల్లికి అవకాశం ఇస్తారా ? అనేది వేచిచూడాలి.

Also Read : Underwater Metro : తొలి అండర్​వాటర్​ మెట్రో వీడియో.. రేపే శ్రీకారం

రేవంత్ రెడ్డి మరో సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి మహబూబ్‌నగర్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారట. ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి అప్లికేషన్ కూడా సమర్పించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని నిరూపిస్తూ.. మహబూబ్‌నగర్ నుంచి ఇప్పటికే చల్లా వంశీ చంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తిరుపతి రెడ్డికి మరో స్థానం నుంచి లోక్‌సభ టికెట్ ఇస్తారా? అసలే ఇవ్వరా ? అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Also Read :4600 RPF Jobs : రైల్వేలో 4660 ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టులు.. అప్లై చేసుకోండి

‘‘మీ సోదరులు కూడా రాజకీయాల్లోకి వస్తారా ? మీ కుటుంబం నుంచి ఇంకెవరైనా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతారా ?’’ అని ఒకానొక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా ఒక సమాధానం ఇచ్చారు. తాను తప్ప తన కుటుంబం నుంచి ఎవరూ పాలిటిక్స్‌లోకి రారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘నేను రాజకీయాల్లోనే కొనసాగుతాను. మీరంతా బిజినెస్‌లు చూసుకోండి నా సోదరులకు చెప్పాను’’ అని రేవంత్ రెడ్డి వివరించారు. దీన్నిబట్టి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సోదరులు(CM Revanth – 2 Brothers) పోటీ చేస్తారనే ప్రచారం అబద్ధమని తేటతెల్లమైంది. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే రేవంత్ రెడ్డి .. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించరనేది నిజమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.