Purushotham Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆదివారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివదేహానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. పురుషోత్తం రెడ్డి మృతిపట్ల పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటించారు.
Read Also: Tamil Nadu Cabinet Reshuffle : స్టాలిన్ క్యాబినెట్‌లోకి కొత్తగా చేరిన వారు వీరే..
కాగా, పురుషోత్తంరెడ్డి పార్థివదేహానికి రాజకీయ పార్టీల నేతలు నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, వద్ది రవిచంద్ర తదితరులు నివాళులర్పించి ఉత్తమ్, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. పురుషోత్తం రెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.