CM Revanth Reddy : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ సమావేశం..

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme ) కింద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహిళలకు ఫ్రీ (Free Bus Travel for Women) బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంటే..ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు (Auto and Taxi Drivers) మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా తమ జీవితాలు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. ప్రతి రోజు వెయ్యి రూపాయిల […]

Published By: HashtagU Telugu Desk
Revanth Auto

Revanth Auto

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme ) కింద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహిళలకు ఫ్రీ (Free Bus Travel for Women) బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంటే..ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు (Auto and Taxi Drivers) మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా తమ జీవితాలు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. ప్రతి రోజు వెయ్యి రూపాయిల వరకు సంపాదించుకునే వాళ్లమని..ఇప్పుడు కనీసం వంద రూపాయిలు కూడా సంపాదించలేకపోతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ అని చెప్పేసరికి ఒక్కరు కూడా ఆటో ఎక్కడం లేదని..కాస్త దూరానికి కూడా బస్సు కోసమే ఎదురుచూస్తున్నారని ఆటో డ్రైవర్లు తెలుపుతున్నారు. మార్పు కావాలని కోరుకుంటే..మా కడుపు కొడతాడా అంటూ వారంతా ఆవేశంతో ఊగిపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఇప్పటికే పలు చోట్ల నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఆటో డ్రైవర్లతో సమావేశం కాబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సమావేశంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ఆటో డ్రైవర్ల తరపున నిరసనలకు బీఆర్ఎస్ అనుబంధ ఆటో యూనియన్లు సిద్ధం అవుతున్నది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం కోసం కార్మిక విభాగం నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి సీఎం రేవంత్ ఆటో డ్రైవర్ల ఆవేదన పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read Also : Mokshagna Debut : ‘మహాభారతం’లో మోక్షజ్ఞ.. రాజమౌళితో పాన్ ఇండియా ఎంట్రీ !?

  Last Updated: 23 Dec 2023, 03:16 PM IST