తెలంగాణలో గిగ్ వర్కర్ల భద్రత(Safety of Gig Workers)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షలమంది గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్లు ఉన్నారని అంచనా. వారికి బీమా, ఇతర హక్కులు కల్పించేందుకు “తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్లు” (Gig Workers Act) ముసాయిదాను సిద్ధం చేయగా, ఇటీవల ఆ ముసాయిదాను సీఎంకు అధికారులు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కొన్ని కీలక మార్పులు సూచిస్తూ, కార్మికుల హక్కులకు గౌరవం ఇచ్చేలా, కంపెనీలు-వర్కర్ల మధ్య సమన్వయాన్ని పెంచేలా చట్టాన్ని రూపొందించాలని ఆదేశించారు.
Telangana : త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ: సజ్జనార్
ఈ బిల్లును ముందుగా ఆన్‌లైన్‌లో ఉంచి ప్రజాభిప్రాయాలను సేకరించాలనీ, అన్ని వర్గాల సూచనలు తీసుకొని మే 1 (మే డే) నాటికి తుది రూపం ఇవ్వాలని సీఎం సూచించారు. గతంలోనే గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలుచేసిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు దేశంలోనే ముందుగా ఈ విభాగానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది. ఈ చట్టం దేశానికి మార్గదర్శకంగా నిలవాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు. ఇది గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడంలో మైలురాయిగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 22 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. టోక్యో, ఒసాకా నగరాల్లో జరిగే పారిశ్రామిక సమావేశాల్లో పాల్గొని, తెలంగాణకు పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిని ఆకర్షించేందుకు చర్చలు జరపనున్నారు.