CM Revanth : తెలంగాణ మహిళలకు వరాలు అందించబోతున్న సీఎం రేవంత్

CM Revanth : మొత్తం మీద మహిళలు, నిరుద్యోగులు, రైతులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Good News

Cm Revanth Good News

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తికావస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) వరుసగా తీపి కబుర్లు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అనేక కీలక హామీలను అమలు చేసిన ప్రభుత్వం, తాజాగా 30 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల నిరుపేద కుటుంబాలు అన్నపూర్ణ స్కీమ్, ఉచిత బియ్యం లాంటి ప్రయోజనాలను పొందనున్నారు. రేషన్ కార్డుల పంపిణీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Bangladesh : షేక్‌ హసీనా పై సీఐడీ కేసు నమోదు

ఇదే తరుణంలో మహిళలకు ఉచిత చీరలు అందజేసే పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దసరా, బతుకమ్మ పండుగలకు ఉచిత చీరల పంపిణీపై స్పష్టత రావడంతో లక్షలాది మంది మహిళలకు ఇది తీపికబురుగా మారింది. అంతేకాదు నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ముఖ్యంగా స్కిల్ వర్శిటీ ద్వారా ఉద్యోగ కల్పనకు మరింత ఊతం ఇచ్చేలా మరో కొత్త ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది.

Earthquake: భారత్‌ మరోసారి సాయం.. మయన్మార్‌కు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది!

ఇటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటుచేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణలో ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని సీఎం రేవంత్ ప్రకటించారు. మొత్తం మీద మహిళలు, నిరుద్యోగులు, రైతులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

  Last Updated: 29 Mar 2025, 03:46 PM IST