కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభలో(Praja Palana Sabha ) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజెపి , బిఆర్ఎస్ పార్టీల నేతల పై విరుచుకపడ్డారు. కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు లనే కాదు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ లను కూడా వదిలిపెట్టలేదు. ఎప్పటిలాగానే తన మాటల తూటాలను వదులుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
కేసీఆర్ (KCR) తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిని , మళ్లీ గడ్డమీద కేసీఆర్ మొక్కను మొలవనివ్వనని, రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి. ఒక్కసారి ఓడిస్తే.. మళ్లీ ప్రజల మొహం చూడవా? అధికారం ఇస్తే దోచుకోవటం.. ఓడిస్తే ఫామ్‌హౌజ్‌లో దాచుకోవటం. ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావటం లేదు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదు. మూడుసార్లు అధికారం దక్కపోయినా.. రాహుల్ గాంధీ ప్రజల మధ్యే ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం సూచనలు ఎందుకు చేయట్లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్(Gujarat)కు వెళ్లిపోవాని సూచించారు. గుజరాత్ గులాంను అని చెప్పుకునే కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదని విమర్శించారు. అసలు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. ఒక్కసారి కాదు.. పదిసార్లు ఆమె కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకున్నా తప్పులేదని కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఊడిగం చేస్తున్నారని, తెలంగాణ పట్ల చిత్తశుధ్దిలేదన్నారు. గుజరాత్ లో సబర్మతి సుందరీకరణను సమర్థించి.. తెలంగాణలో మూసీ సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాళోజీ నారాయణ రావు బతికి ఉంటే కేసీఆర్(KCR), కిషన్ రెడ్డిలను తెలంగాణ నుంచి తరిమివేసే వారని అన్నారు.
Read Also : Praja Vijayotsava Sabha : తాగుబోతుల సంఘానికి కేసీఆర్ అధ్యక్షుడు – సీఎం రేవంత్