Site icon HashtagU Telugu

CM Revanth Reddy Birthday : సీఎం రేవంత్ పై ఏమన్నా అభిమానమా..?

Cmrevanth

Cmrevanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) పుట్టిన రోజు (CM Revanth Reddy Birthday) ఈరోజు (నవంబర్08 ). ఈ సందర్భాంగా పార్టీ నేతలు , శ్రేణులు , ఇతర పార్టీ నేతలు ఇలా ప్రతి ఒక్కరు..ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే కొంతమంది వీరాభిమానులు వినూత్న పద్దతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి వార్తల్లో నిలిచారు. మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సీఎం రేవంత్ పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తన పొలంలో వరి నాటుతో సీఎం ముఖచిత్రం వచ్చేలా సాగు చేసి ఆశ్చర్యపరిచారు. రెండు నెలలుగా దీనిని ఆయన సాగు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ నేతన్న పట్టు చీరపై రేవంత్ ఫొటో నేసి అందరినీ ఆకట్టుకున్నారు.

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ (మ) యాంకి గ్రామానికి చెందిన సున్నపు అశోక్ కోడిగుడ్డుపై మార్కర్ సాయంతో సీఎం రేవంత్ చిత్రాన్ని గీసి హురా అనిపించుకున్నారు. పెళుసుగా ఉండే గుడ్డుపై చాలా జాగ్రత్తగా చిత్రం గీసిన అశోక్ టాలెంట్ పై అంత ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఎల్బీనగర్‌కు చెందిన చిత్రకారుడు రాము కూడా రేవంత్‌కు శుభకాంక్షలు తెలిపారు. అయితే రాము.. తాను ముఖ్యమంత్రికి ఇచ్చే బహుమతి ఎప్పటికీ గుర్తుండాలని భావించాడు. అనుకున్నదే తడువుగా తన చిత్ర కళా నైపుణ్యంతో రేవంత్ ముఖ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. అయితే సీఎం చిత్రపటాన్ని చిత్రీకరించింది పెన్సిల్‌తోనో లేక రంగులతోనో కాదు.. ఆవగింజలతో రేవంత్‌ ముఖచిత్రాన్ని వేశాడు రాము. ఆవగింజలను ఒక్కొక్కటి పేరుస్తూ రేవంత్ ముఖచిత్రం వచ్చేలా ఎంతో అందంగా చిత్రీకరించాడు. ప్రస్తుతం రాము వేసిన ఆవగింజలతో సీఎం చిత్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా చాలామంది తమదైన శైలి లో సీఎం రేవంత్ పై తమ అభిమానాన్ని చాటుకొని వార్తల్లో నిలిచారు.

Read Also : Mohammad Nabi: క్రికెట్‌కు స్టార్ ప్లేయ‌ర్ రిటైర్మెంట్‌!