Site icon HashtagU Telugu

CM Revanth : భద్రాచలంలో ఈ నెల 11 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..?

Revanth Bcm

Revanth Bcm

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) ఈ నెల 11 న భద్రాచలం (Bhadrachalam ) లో పర్యటించబోతున్నట్లు సమాచారం అందుతుంది.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ తొలిసారి భద్రాద్రి జిల్లా పర్యటనకు రాబోతున్నారు. 11వ తేదీన భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బూర్గంపాడు వద్ద ఇందిరమ్మ ఇళ్ల పథకానికి (Indiramma Housing Scheme) శ్రీకారం చుట్టబోతున్నారు. తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనపై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు , ఉచిత కరెంట్ , రూ.500 లకే గ్యాస్ వంటి హామీలను అమలు చేయగా..ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని 11న ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణామంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులతో సీఎం రేవంత్‌ శనివారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఈ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తొలుత ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ. 5 లక్షలు ఇస్తారు. నిధులు ఏయే దశల్లో విడుదల చేయాలనే దానిపై నిబంధనలు సిద్ధం చేయాలని, లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు.

Read Also : Acid Attack : ముగ్గురు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ దాడి.. యువకుడి దుశ్చర్య