CM Race : కాంగ్రెస్ లో నివురుగ‌ప్పిన నిప్పులా సీఎం అభ్య‌ర్థిత్వం ఇష్యూ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని  (CM Race)ఆ పార్టీ తెలంగాణ లీడ‌ర్లు విశ్వ‌సిస్తున్నారు. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత సీన్ మారింది.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 03:13 PM IST

రాబోవు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని  (CM Race)ఆ పార్టీ తెలంగాణ లీడ‌ర్లు విశ్వ‌సిస్తున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత సీన్ మారింది. అధికారంలోకి వ‌చ్చిన‌ట్టే ఫీల్ అవుతున్నారు. రాబోయే సీఎం ఎవ‌రు? అనే అంశంపై త‌ర‌చూ చ‌ర్చ‌ల్లోకి తీసుకొస్తున్నారు. ఒక‌రు ఎస్టీ లీడ‌ర్ సీఎంగా ఉంటార‌ని మ‌రొక‌రు ఎస్సీ ల‌కు అవ‌కాశం ఇస్తార‌ని, ఇంకొక‌రు బీసీల‌కు ఇవ్వాల‌ని ఏదో ఒక సంద‌ర్భంలో తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. దీంతో సామాజిక ఈక్వేష‌న్ల న‌డుమ స‌మ‌తూకం లేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది క‌ర‌మే. అయిన‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌త అభిప్రాయం అంటూ ఎవ‌రివారే సీఎం అభ్య‌ర్థిత్వంపై మీడియాకు ఎక్కుతున్నారు.

ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని  (CM Race)

మిగిలిన పార్టీల‌తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌. ఎవ‌రైనా వ్య‌క్తిగ‌త అభిప్రాయాన్ని స్వేచ్ఛ‌గా చెప్పుకోవ‌డానికి అవకాశం ఉంది. అందుకే, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ‌కాలం ప‌నిచేసిన వాళ్లు ఇత‌ర పార్టీల్లో ఇమ‌డ‌లేరు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చేస్తారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అదే జ‌రుగుతుంది. ఇత‌ర పార్టీల‌కు వెళ్లిన లీడ‌ర్లు ఘ‌ర్ వాప‌సీ మాదిరిగా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ లోడ్ అవుతోంది. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి ఇద్ద‌రు ముగ్గురు అభ్య‌ర్థులు త‌యారుగా ఉన్నారు. కాంపిటేష‌న్ పెరిగింది. ఆ క్ర‌మంలో సామాజిక ఈక్వేష‌న్ గ‌ళాన్ని  (CM Race)ఎవ‌రికివారే వినిపిస్తున్నారు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ద‌ళితుడ్ని సీఎం

సామాజిక‌వ‌ర్గాల బ‌లాబ‌లాల‌ను ప‌రిశీలిస్తే, బీసీ, ఎస్సీలు ఎక్కువ‌గా తెలంగాణ‌లో ఉంటారు. వాళ్ల‌కు రాజ్యాధికారం ఉండాలని కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. అయితే, ఏ పార్టీ ఆ సామాజిక‌వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డంలేదు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ద‌ళితుడ్ని సీఎం.(CM Race) చేస్తాన‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాప‌లా కుక్క‌లా తెలంగాణ‌కు ఉంటాన‌ని చెప్పారు. కానీ, తెలంగాణ వ‌చ్చిన త‌రువాత సీఎంగా కేసీఆర్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆనాడు చెప్పిన మాట‌ల‌ను ప‌క్క‌న పెట్టేశారు. ప్ర‌జాస్వామ్యంలో ఓట‌ర్లు త‌న‌కు ఓట్లేసి గెలిపించారు కాబ‌ట్టి రాష్ట్రం ఆగం కాకుండా ఉండాలంటే తానే సీఎంగా ఉండాల‌ని కేసీఆర్ నిర్థారించుకున్నారు.

సీనియ‌ర్ల‌ను కించప‌రిచేలా రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు (CM Race)

ప్ర‌త్యేక తెలంగాణ ఇచ్చిన త‌రువాత సామాజిక తెలంగాణ ను ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ తొలి రోజుల్లో భావించింది. పీపీసీ చీఫ్ గా రాష్ట్రం ఏర్ప‌డిన తొలి రోజుల్లో పొన్నాల ల‌క్ష్మ‌య్య‌కు అవ‌కాశం ఇచ్చారు. బీసీల‌ను ఉన్న‌త ప‌ద‌వులకు(CM Race)తీసుకెళ్లాల‌ని కాంగ్రెస్ అడుగులు వేసింది. కానీ, 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ త‌రువాత ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. అయిన‌ప్ప‌టికీ పార్టీ ప‌రిస్థితి మెరుగుప‌డలేదు. 2018, 2019 ఎన్నిక‌ల్లోనూ భంగ‌ప‌డింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లోజ్ అయంద‌న్న భావన అప్ప‌ట్లో క‌లిగింది.

Also Read : T-Congress Leaders : టీ కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే.. లీకైన లిస్ట్

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కొన్ని వివాద‌స్ప‌ద అంశాలు పార్టీని వెంటాడాయి. సీనియ‌ర్లు వ‌ర్సెస్ రేవంత్ రెడ్డి అంటూ చాలా కాలం అంత‌ర్గ‌త కుమ్ములాట న‌డిచింది. ఆ త‌రువాత రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి రాజ్యాధికారం కావాల‌ని రేవంత్ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో చేసిన కామెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో మిగిలిన సామాజిక‌వ‌ర్గాలు గ‌మ్మ‌నంగా ఆ మాట‌ను మ‌న‌సులో పెట్టుకుని కాంగ్రెస్ లో కొన‌సాగుతున్నాయి. హోంగార్డులు అంటూ సీనియ‌ర్ల‌ను కించప‌రిచేలా రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ఉప ఎన్నిక‌ల్లో వ‌రుస ఓట‌ముల‌ను చ‌విచూసిన కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌న్న భావాన్ని కలిగించింది. ఇలా ఒడిదుడుకుల మ‌ధ్య తెలంగాణ కాంగ్రెస్ ను న‌డిపించిన రేవంత్ క   క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు ఊర‌ట‌ను ఇచ్చాయి.

రాజ్యాధికారాన్ని బీసీల‌కు ద‌క్కేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని మెప్పించాల‌ని

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంద‌న్న న‌మ్మ‌కం ఎక్కువ మందిలో క‌లుగుతోంది. అందుకే, సీఎంగా సీత‌క్క ఉండే ప‌రిస్థితి వ‌స్తుందేమో అనే సంకేతం పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి అమెరికా వేదిక‌గా సంకేతాలు ఇచ్చారు. పీపుల్స్ మార్చ్ పేరుతో పాద‌యాత్ర చేసిన భ‌ట్టీ విక్ర‌మార్క్ ను ఏఐసీసీ ప్రోత్స‌హిస్తుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని సీనియ‌ర్లు సైతం ప‌రోక్షంగా అంగీక‌రించారు. ఆయ‌న్ను సీఎం అభ్య‌ర్థిగా అంగీక‌రిస్తూ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి త‌దిత‌రులు ప‌రోక్షంగా సంకేతాలు ఇవ్వ‌డం ద్వారా ద‌ళిత సీఎం తెలంగాణ‌కు  (CM Race)ఉంటాన్న స్లోగ‌న్ వెళ్లింది. అయితే, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు అడ్డ‌గా ఉన్న తెలంగాణ‌లో రాజ్యాదికారాన్ని ఆ వ‌ర్గం కోరుకుంటోంది. ఇటీవ‌ల బీసీల‌ను కించ‌ప‌రుస్తూ రేవంత్ మాట్లాడాడ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని బీసీలు ధ‌ర్నాల‌కు దిగారు.

Also Read : Revanth Reddy : రేవంత్ ఫెయిల్యూర్ స్టోరీ

బీసీల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్, న్యాయ‌వాది జీవ‌న్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. అదే విష‌యాన్ని ఇటీవ‌ల కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా వెలుబుచ్చారు. బీసీలు అంద‌రూ ఏకంగా క‌వాల‌ని కాంగ్రెస్ పార్టీలోని లీడ‌ర్లు ప‌ర‌స్ప‌రం చెప్పుకుంటున్నారు. రాబోవు రోజుల్లో రాజ్యాధికారాన్ని బీసీల‌కు ద‌క్కేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని మెప్పించాల‌ని వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. ఎప్ప‌టి నుంచో బీసీల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీనియ‌ర్ లీడ‌ర్ వీహెచ్ కోరుకుంటున్నారు. ప‌లుమార్లు బీసీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తూ హ‌నుమంత‌రావు ల‌బ్దిపొందారు. ఈసారి సీఎం ప‌ద‌విని అందుకోవాల‌సి బీసీ నాయ‌కులు భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం ప‌ద‌విని ఆశిస్తున్నారు. ఆయ‌న స‌భ‌ల‌కు వెళ్లిన ప్ర‌తిసారీ అభిమానులు సీఎం నినాదాలు చేస్తున్నారు. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ సీఎం అభ్య‌ర్థిత్వం సామాజిక‌వ‌ర్గాల మ‌ధ్య కాంగ్రెస్ పార్టీలోనే అంత‌ర్గ‌త విభేదాల‌ను సృష్టించేలా క‌నిపిస్తోంది.