Site icon HashtagU Telugu

Old City Metro: పాతబస్తీ మెట్రోపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Old Cty Metro

New Web Story Copy 2023 07 11t070121.125

Old City Metro: పాతబస్తీ మెట్రోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. గత కొంతకాలంగా పాతబస్తీ మెట్రో అంశం నలుగుతూ వస్తుంది. హైదరాబాద్ లోని అన్ని ప్రధాన ఏరియాలకు మెట్రో పరుగులు పెడుతుంది. అయితే హైదరాబాద్ లోని పాతబస్తీకి మాత్రం ఆ మోక్షం ఇంకా లభించలేదు. అయితే తాజాగా ఈ అంశంపై సీఎం కేసీఆర్ పాతబస్తీ మెట్రోకు సంబంధించి మున్సిపల్ డిపార్ట్మెంట్ ని ఆదేశించారు. ఓల్డ్ సిటీకి మెట్రో ఏర్పాటుపై పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ మరియు ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్‌లో తెలిపారు. పాతబస్తీ మెట్రో ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ ఆ రెండు డిపార్మెంట్లను ఆదేశించారు.

పాతబస్తీ మెట్రోపై కేటీఆర్ చేసిన ట్వీట్ కి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఒవైసీ స్పందించారు. ఓల్డ్ సిటీ ప్రజలు మెట్రో కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని ఒవైసీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా ఓల్డ్ సిటీ ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని, మీరు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను ఒవైసి అన్నారు.

2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో పాతబస్తీకి మెట్రో రైలు సేవలను పొడిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా పటాన్‌చెరు, కందకూరు వరకు మెట్రోను పొడిగిస్తామని కేసీఆర్హా గత నెలలో మీ ఇచ్చారు. ఇక తాజాగా పాతబస్తీ మెట్రో పనులను వేగవంతం చేయాలనీ తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

Read More: OPPO Phones : ఒప్పో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఒప్పో రెనో 10 5G