Telangana Formation Day : నేడు సోనియాతో రేవంత్ రెడ్డి, భట్టి భేటీ..

రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీని సీన్ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 08:00 AM IST

తెలంగాణ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti VIkramarka) నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. జూన్‌ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు (Telangana Formation Day) రావాల్సిందిగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi)ని సీన్ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న ఈ ఇద్దరు నేతలు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి కేరళలో ఉండగా, డిప్యూటీ సీఎం పంజాబ్‌లో ఉన్నా రు. మంగళవారం ఉదయం వీరిద్దరూ ఢిల్లీకి చేరుకోనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా జరిపేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఏర్పాట్ల ఫై CS శాంతికుమారి అధికారులతో సమీక్షా నిర్వహించడం జరిగింది. జూన్ 2న ఉదయం గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారని , అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. జూన్ 2 రాత్రి 7 గంటల నుండి 9 వరకు ట్యాంక్ బండ్‌పై కళారూపాల కార్నివాల్ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 5 వేల మంది శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారని , ట్యాంక్ బండ్‌పై హస్త కళలు, చేనేత కళలు స్టాళ్లు, స్వయం సహాయక బృందాల స్టాళ్లు, నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలతో పాటు, బాణాసంచా, లేజర్ షో ఈవెంట్ ఉంటుందని వెల్లడించారు.

ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జూన్‌ 1 నుంచి 3వ తేదీ వరకు మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఈ వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న తెలంగాణభవన్‌లో నిర్వహించే ముఖ్య కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకోనున్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకోనున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలంపాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

Read Also : Electric Scooters: జోరు పెంచిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల అమ్మ‌కాలు