Site icon HashtagU Telugu

CM KCR Warangal Tour : కేసీఆర్ రాక సందర్బంగా రేపు వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Kcr Wgl

Kcr Wgl

తెలంగాణ ఎన్నికల (Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తమ ప్రచారం తో జోరు చూపిస్తున్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్ (KCR) ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. అభ్యర్థుల ప్రకటనే కాదు ప్రచారం కూడా ముందు నుండే చేసుకుంటూ వస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. గత కొద్దీ రోజులుగా ప్రజాఆశీర్వాద సభ (Praja Ashirvada Sabha)ల పేరుతో జిల్లాల పర్యటన చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో భారీ సభలు నిర్వహించిన కేసీఆర్..రేపు వరంగల్ (Warangal ) జిల్లా తో పాటు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ సందర్బంగా రేపు వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేసారు ట్రాఫిక్ పోలీసులు.

We’re now on WhatsApp. Click to Join.

వరంగల్లోని బట్టుపల్లి, కడిపికొండ మార్గంలో ఎస్ఆర్ స్కూల్ రోడ్డులో భారీ వాహనాలకు ట్రక్కులు కడిపికొండ ఫ్లైఓవర్ మీదుగా అనుమతించబడవు అని తెలిపారు. కాబట్టి హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం నుంచి వచ్చే భారీ వాహనాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర గల ఓఆర్ఆర్ మీదుగా, ఎనుమాముల మార్కెట్, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్రోడ్డు మీదుగా ఖమ్మంకు వెళ్ళ వలసి ఉంటుంది అని పోలీసులు వెల్లడించారు. అలాగే ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ల వలసిన భారీ వాహనాలు నాయుడు పంపు నుంచి పోర్టు రోడ్డు, తెలంగాణ జంక్షన్, ఎనుమాముల మార్కెట్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా హైదరాబాద్ కు వెళ్ళ వలసి ఉంటుంది అని వరంగల్ పోలీసులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ మీటింగ్ జరిగే ప్రదేశంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు గానూ.. ట్రై సీటి పరిధిలో భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 06.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Read Also : Nara Bhuvaneshwari : తాత ఎక్కడ అని దేవాన్ష్ అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది – నారా భువనేశ్వరి