Site icon HashtagU Telugu

BRS Manifesto: BRS మేనిఫెస్టో.. విపక్షాల మైండ్‌ బ్లాక్‌

Brs Manifesto

Brs Manifesto

BRS Manifesto: అక్టోబర్‌ 16న వరంగల్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.తెలంగాణలో బీఆర్‌ఎస్‌ విజయంపై విశ్వాసం వ్యక్తం చేసిన హరీశ్‌రావు.. తమ మేనిఫెస్టుతో విపక్షాల మైండ్‌ బ్లాక్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబరు 4 బుధవారం కొడంగల్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ పాల్గొన్నారు.

కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో 50 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. గత పాలకుల వివక్షతో ఒకప్పుడు వెనుకబడిన కొడంగల్ బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చెందుతోందన్నారు. కోస్గి, కొడంగ‌ల్‌లో ఒక‌ప్పుడు మంచి నీటి క‌ష్టాలుండేవన్నారు. మూడు రోజులకొకసారి నీళ్లు వ‌చ్చేవ‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ట్యాంక‌ర్ల వెంట నీళ్ల కోసం మహిళలు ప‌రుగెత్తేవారని. గ‌తంలో బోరింగ్‌లు కొట్టి, నీల్లు మోసి ఇబ్బంది ప‌డ్డారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఇంటింటికీ న‌ల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామని హరీష్ చెప్పారు. కొడంగ‌ల్ ఆడ‌బిడ్డ‌ల క‌ష్టాలు తీర్చారు సీఎం కేసీఆర్. రేవంత్ రెడ్డి గెలిచి ఉంటే మ‌రో 10 ఏండ్లు అయినా మంచినీళ్లు వచ్చేవి కావని స్పష్టం చేశారు. కర్ణాటకలో కల్యాణ లక్ష్మి ఉందా. 12 లక్షల పెళ్లిళ్లకు రూ. 11 వేల కోట్లు ఇచ్చింది మా ప్రభుత్వమని అన్నారు.

మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, పౌష్టికాహార కిట్‌, గృహలక్ష్మి వంటి పథకాలను అమలు చేసిందని గుర్తు చేసిన మంత్రి, ఈసారి బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో మహిళా’ఆర్థిక సాధికారతపై దృష్టి సారించామన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటుగా స్పందించిన హరీశ్ రావు.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అతనిపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసినట్టు హరీష్ పేర్కొన్నారు. త్వరలోనే రేవంత్ పై విచారణ ఖాయమని, రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయం హరీష్ కుండబద్దలు కొట్టారు.

Also Read: Army – Kautilyas Lessons : ఆర్మీకి కౌటిల్యుడి యుద్ధ వ్యూహాలపై పాఠాలు!