తెలంగాణ ఎన్నికల (Telangana Assembly Election 2023) నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్..నేడు తెలంగాణ భవన్ లో అభ్యర్థులకు దిశానిర్దేశం చేసారు. మరో 45 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ (TRS) ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..మరికాసేపట్లో 2023 మేనిఫెస్టో (BRS Manifesto) ను విడుదల చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో మరోసారి మనమే ప్రభుత్వం ఏర్పాటు
కొద్దీ సేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్..భవనంలో జయశంకర్ సార్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కేసీఆర్‌కు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణలో మరోసారి మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం… ఎవరూ తొందరపడొద్దని బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. సాంకేతికగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, కోప తాపాలను అభ్యర్థులు పక్కన పెట్టాలని తెలిపారు. ప్రతి విషయంపై అభ్యర్థులు క్లారిటీతో ఉండాలని, శ్రీనివాస్ గౌడ్, వనమా వెంకటేశ్వర్ రావు, కృష్ణ మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు. గెలవలేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారు. సాంకేతికంగా కారణాలు చూపి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మనకు మంచి న్యాయకోవిదులు ఉన్నారు. మీకు గైడ్ చేయడానికి న్యాయవాదులు అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి, తెలియని విషయాలు తెలుసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తమాషాలు చూస్తుంటాం. ఈ ఎన్నికల్లో నిబంధనలు మారుస్తుంటారు. ప్రతిది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మాకు తెలుసులే అని అనుకోవద్దు అని సూచించారు.
మన పార్టీకి, ఎన్నికల కమిషన్‌కు మధ్య వారధిగా భరత్ కుమార్
98480 23175 నంబర్‌కు ఫోన్ చేస్తే భరత్ కుమార్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. మన పార్టీకి, ఎన్నికల కమిషన్‌కు మధ్య వారధిగా భరత్ కుమార్ పని చేస్తున్నారు.అభ్యర్థులకు సందేహాలు వస్తే ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే పరిష్కారం చూపిస్తారు. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఇప్పట్నుంచే నామినేషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చివరి రోజున నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించొద్దు అన్నారు. అభ్యర్థులకు 2 రోజుల్లో భీపామ్స్ అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం 51 మందికి సంబదించిన బీ-ఫారాలు సిద్ధం అయ్యాయని , మిగతావి సిద్ధం అవుతున్నాయని అవి సిద్ధం అవ్వగానే విడుదల చేస్తామని తెలిపారు.
Read Also : Mandava Venkateswara Rao : చక్రం తిప్పిన తుమ్మల, రేవంత్.. కాంగ్రెస్ లోకి మరో కీలక నేత !